టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు దాదాపు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. 2015లో కిక్2, బెంగాల్ టైగర్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం రాజా ది గ్రేట్. విభిన్నమైన పాత్రలతో, హై ఎనర్టీ అటిట్యూడ్‌తో తెరపైన కనిపించే రవితేజ.. ఈ సారి ఓ ప్రయోగానికి ఒడిగట్టాడు. రాజా ది గ్రేట్‌లో అంధుడి పాత్రలో కనిపించాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను మేలవించి రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. అంధుడి పాత్రలో నటించిన రవితేజ ఏ మేరకు మెప్పించడానే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
రాజా ది గ్రేట్ కథ ఇలా లక్కీ (మెహ్రీన్) తండ్రి ప్రకాశ్‌రాజ్ నిఖార్సైన పోలీస్ ఆఫీసర్. విధి నిర్వహణలో విలన్ (వివాన్ భటేనా) చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. తన తమ్ముడి మరణానికి కారణమైన లక్కీని చంపాలనుకొంటాడు. ఇక రాజా (రవితేజ) పుట్టుకతోనే గుడ్డి. పోలీసు ఉద్యోగి అనంత లక్ష్మి (రాధిక) కుమారుడు రాజా. రాజాను పోలీస్‌గా చూడాలనుకొంటుంది. కానీ అంధుడు కావడం వల్ల పోలీస్ శాఖ ఒప్పుకోదు. అయితే అంధుడైనప్పటికీ అన్ని విద్యల్లో పర్‌ఫెక్ట్‌గా శిక్షణ పొందుతాడు. చాలా స్టయిలీష్‌గా ఉండటం రాజాకు చాలా ఇష్టం. ఇలా జీవితం కొనసాగిస్తుండగా లక్కీ జీవితంలోకి రాజా ప్రవేశిస్తాడు. లక్కీని చంపాలనుకొన్న విలన్ బారి నుంచి గుడ్డివాడైన రాజా సిద్ధమవుతాడు.
కథలో చిక్కుముడులకు సమాధానం ఇలా.. పోలీస్ డిజైన్ చేసిన ఆపరేషన్‌లో భాగమవుతాడు. పోలీస్ ఆపరేషన్ ఏ విధంగా నిర్వహించాడు. విలన్ ఆట ఎలా కట్టించాడు. తండ్రి ఆశయాన్ని కొనసాగించడానికి లక్కీ ఎలాంటి కష్టాలు పడింది. గుడ్డివాడిగా రవితేజ ఎలా మెప్పించాడు. కుటుంబ వ్యతిరేకతను ఎదుర్కొన్న మెహ్రీన్ ఏ విధంగా సహాయపడ్డారు. సొంత భార్యలపై అరాచకానికి పాల్పడే మెహ్రీన్ బాబాయిలను గుణపాఠం ఎలా నేర్పాడు. ఇంకా వివిధ విభాగాల పనితీరు ఎలా ఉందనే ప్రశ్నలకు సమాధానమే రాజా ది గ్రేట్ మూవీ