జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని దుండ్ర కుమారస్వామి దర్శించుకుని ప్రజలకు మంచి జరిగేలా చూడాలని కోరుకున్నారు. దుండ్ర కుమారస్వామికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా వెలుగొందుతున్న జోగులాంబ అమ్మవారు కోరిన కోర్కెలను తీరుస్తారని దుండ్ర కుమారస్వామి తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండే కాక ఏపీ, కర్ణాటక నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు.
దేశంలో ఉన్న నవబ్రహ్మా ఆలయాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ప్రతీ ఆలయం చూడటానికి ఒకేలా ఉన్నా దేని ప్రత్యేకత దానిదే అని దుండ్ర కుమారస్వామి. రాష్ట్రంలో పర్యాటకాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో కూడా జోగులాంబ దేవాలయం సహాయాన్ని అందిస్తూ ఉంది. ఇక బీసీలకు రాజ్యాధికారం దక్కేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఎంతో మంది బీసీ నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని.. వారికి విజయం వరించాలని కోరినట్లు తెలిపారు.
ఎన్నికలసమయాల్లో బీసీలను వాడుకొని అనంతరం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. దేశంలోని బీసీలను ఐక్యం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. బీసీల రాజ్యాధికారం కోసం డిసెంబర్ నెల నుండి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.