ఇటీవల మంత్రి పదవి వచ్చిన సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డికి నెల్లూరులో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఆ తర్వాత కాకాణి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక మొదటిసారి నెల్లూరు వెళ్తున్నప్పుడు ర్యాలీ నిర్వహించారు. దానికి పోటీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సభ పెట్టాడు.
నెల్లూరు జిల్లాలోని వైకాపా నేతల రచ్చ సీఎం జగన్‌కు చేరింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ లకు సీఎం క్యాంపు కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది. తాడేపల్లికి వచ్చి క్యాంప్ కార్యాలయంలో కలవాలని సీఎం ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం 3మూడు గంటలకు వీరు సీఎంతో సమావేశమవుతారు.