మీకు కరోనా ఉందా? ఉందేమోనన్న అనుమనమా? జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనా వచ్చిందేమో అనే భయంతో కూడిన అనుమానమా?
ఒకవేళ మీలో అలాంటి కరోనా లక్షణాలు కనిపిస్తే
మీరు ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు.. వెంటనే సొంతగా ఇంట్లోనే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టండి. సొంతగా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే స్వయంగా అందరికీ చెబుతున్న సూచన.
కరోనా అని కన్‌ఫాం చేసుకునే ధ్యాసలో పడి అందరూ టెస్ట్‌ల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టెస్ట్‌లు ఇస్తే, రిజల్ట్స్ రావడానికి 2 రోజుల నుంచి 3 రోజుల సమయం పడుతోంది.
అంటే మూడురోజుల పాటు ఆ లక్షణాలతో నరకం చూడాల్సిందే అన్నమాట. ఒక్కోసారి అప్పటికే పరిస్థితి చేజారి ఆస్పత్రి పాలు కూడా అవ్వాల్సి వస్తోంది. అందుకే ముందుగా ట్రీట్‌మెంట్ తీసేసుకోండి అని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం.
ప్రభుత్వం చెబుతున్న సూచనల ప్రకారం కరోనా లక్షణాలు కనిపిస్తే..
- (డాక్సీసైక్లిన్) ఉదయం,రాత్రి 5 రోజుల పాటు వాడాలి.
- (పారాసిటమాల్), (విటమిన్ సి), (మల్టీ విటమిన్) ట్యాబ్లెట్లు కూడా ఉదయం, రాత్రి 10రోజులు వేసుకోవాలి.
- (లెవోసిట్రజిన్), (ర్యాంటడిన్), (విటమిన్ D) ట్యాబ్లెట్లు ప్రతీరోజూ ఉదయం ఒకటి చొప్పున 10రోజులు వేసుకోవాలి.
అప్పటికే జ్వరం, కరోనా లక్షణాలు దాదాపు కంట్రోల్ అవుతాయి. అప్పటికీ ఫీవర్ కంట్రోల్‌లోకి రాకపోతే
- (మిథైల్ ప్రెడ్నిసోలోన్) ట్యాబ్లెట్ ఉదయం, రాత్రి చొప్పున 5 రోజులు వాడండి.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కరపత్రాలను ముద్రించి ఉచితంగా మందులను అందిస్తోంది. అందులో ఏయే సమయాల్లో వాడాలో క్లుప్తంగా వివరించారు.