ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం ఆదివారం కనువిందు చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తొలుత భారత్‌లో గుజరాత్‌లోని ద్వారకలో గ్రహణం కనిపించింది. ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యడు సాక్షాత్కరించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై…మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగిసింది.
సూర్యగ్రహణం వీడడంలో భారత్‌లో కొన్ని ఆలయాలు ఈ రోజు తెరచుకున్నాయి. సూర్యగ్రహణం అనంతరం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు. అలాగే పుణ్యాహవచనం నిర్వహించారు. ఏకాంతంగానే శ్రీవారికి పూజా కైంకర్యాలు చేశారు. నేడు పూర్తిగా దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే విజయవాడలో దుర్గమ్మ ఆలయం తెరుచుకుంది. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం లభించనుంది.