ప్రపంచ స్థాయి ఫార్మా ఈవెంట్‌ను తెలంగాణ రాజధానిలో సక్సెస్ చేసాం
ఫార్మా ఇండియా ఎక్స్ పో 2024 కార్యక్రమాన్ని ఇంత ఎత్తున సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ ఎక్స్ పో ద్వారా ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచానికి తెలిశాయి. ఈ ఎక్స్ పో విజయవంతమయిన స్ఫూర్తితో మరెన్నో కార్యక్రమాలను ఆర్గనైజర్లు చేపడుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇండియన్ ఎగ్జిబిషన్ సర్వీసెస్ CEO స్వదేశ్ , మిలన్ IEC జెనా ప్రాజెక్ట్ డైరెక్టర్, ముజీబుదిన్ CEO క్లినోసోల్, డాక్టర్ NK సెహగల్ సీనియర్ సలహాదారు IEC, డాక్టర్.వినయ్ సరికొండ CEO జెనెసిస్ ఇన్ఫర్మేటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్లుగా వ్యవహరించారు.
ప్రపంచ స్థాయి ఫార్మా ఈవెంట్‌ను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభించడం నిజంగా గర్వకారణమని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ సమ్మిట్ ద్వారా పలు టెక్నాలజీల గురించి తెలుసుకుంటున్నాం, ఇతరులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఎన్నో ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రపంచ స్థాయి ఫార్మా కంపెనీలు, పరికరాల తయారీ,సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీలను ఒకే చోటుకు తీసుకుని వచ్చామని సగర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. ఫార్మా తయారీ రంగం వృద్ధికి చాలా అవసరమైన వేదిక ఇది. ప్రభుత్వాలే అన్నీ చేస్తాయని అనుకోవద్దు.. మనకు వీలైనవి కూడా మనం తప్పకుండా చేయాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు.
గొప్ప గొప్ప సంస్థలు ఈ ఈవెంట్ ను సద్వినియోగం చేసుకొని ‘ప్రపంచానికి ఫార్మసీ హబ్’గా హైదరాబాద్‌ను బలోపేతం చేస్తున్నారన్నారు.
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా పేరు తెచ్చుకున్న భారతదేశం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న 200 కంటే ఎక్కువ దేశాలకు గ్లోబల్ జెనరిక్ మెడిసిన్ సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాక్సిన్‌ల సరఫరాలో 60 శాతం భారత్ లోనే తయారు అవుతున్నాయి, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ల ఉత్పత్తిదారుగా భారతదేశం పేరు సంపాదించుకుందన్నారు. భారతదేశంలో ఫార్మా పరిశ్రమ సాధించిన వృద్ధి నిస్సందేహంగా అసాధారణమైనది. పేటెంట్ల చట్టం 1970 ప్రవేశపెట్టడంతో భారత్ లో ఫార్మా పరిశ్రమ వృద్ధి ప్రారంభమైంది, ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బూస్టింగ్ మరోసారి ప్రభుత్వాలు ఇస్తే ఈసారి భారతదేశ ఫార్మా రంగం మరెన్నో సంచలనాలను సృష్టించగలదు భారతదేశం ఔషధ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేసింది. ఎన్నో దేశాల కష్టాలను మన దేశమే తీర్చబోతోందని అన్నారు దుండ్ర కుమారస్వామి.