ఆర్ కృష్ణయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి..
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పై దాడి చేయటం హేయమైన చర్యగా అభివర్ణించారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి.. ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.. ఇందుకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్‌ను డిమాండ్ చేశారు.
ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిగా పేర్కొన్న దుండ్ర కుమారస్వామి.. ఘటన విషయం తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వివరించారు.. వెనుకబడిన వర్గాల కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఉద్యమ సూర్యుడు కృష్ణయ్య పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛను కాల రాసే ఇటువంటి చర్యలు దురదృష్టకరమని పేర్కొన్న దుండ్ర కుమారస్వామి.. ఈ ఘటన రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందా?.. లేక కక్షపూరితంగా చేసిందా ?.. పోలీసులు వెంటనే విచారణ జరిపి దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రాజ్యసభ సభ్యుడు, కృష్ణయ్య పై జరిగిన దాడిని యావత్ బీసీ సమాజంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని కుమారస్వామి పేర్కొన్నారు..