క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి
క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు:
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
క్రీడలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతాయని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రీడా స్ఫూర్తి కూడా పెరుగుతుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి మండలానికి చెందిన మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని ప్రాథమిక విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించడంలో భాగంగా క్రీడోత్సవాలు నిర్వహించారు. బుధవారం నాడు కె.బి.ఆర్ పార్క్ ముందు మాన్య కల్చరల్ అకాడమీ, వికాస భారత్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, సమన్వయకర్త రామ్ గోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు మోహన్ రావు రాజగోపాల్ ,రెడ్డి ప్రేమ్ సాగర్, నవ్య, ఫుట్ బాల్, స్కేటింగ్ ట్రైనర్ దినేష్ పంచాలి, మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ విజయం అనేది అంత సులువుగా రాదని దానికోసం బలమైన సంకల్ప బలం, ఎనలేని కృషి ఉంటేనే విజయం వరిస్తుందని తెలిపారు. క్రీడలు కేవలం ఆటలు కాదు, మన జీవితంలో అనేక పాఠాలను నేర్పిస్తాయని తెలుసుకోవాలి. క్రీడల వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు దుండ్ర కుమారస్వామి. క్రీడలలో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, సమయపాలన పిల్లల్లో అలవర్చుకోవడమే కాకుండా, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. విద్యార్థి దశలో జీవితంలో మార్పులు తీసుకురావాలనుకుంటే క్రీడలను పిల్లల జీవితంలో భాగమవ్వాలి. విద్య మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది క్రీడలు మన జీవితానికి అనేక పాఠాలు నేర్పిస్తాయి, ప్రతి ఓటమి మరో గెలుపుకు నాంది అన్నట్లుగా పోటీల్లో ఓడిన వారు నిరుస్తాహం చెందకుండా భవిష్యత్తులో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్లాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలలో విజేతలైన వారికి బహుమతులు ప్రధానం చేశారు.