వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి వెడ్డింగ్ రిసెప్షన్.
ఇటీవల వివాహం చేసుకున్న వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురబి పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని శంషాబాద్ జెడి కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ రాజకీయ నేతలు, మంత్రి రవాణా శాఖ మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మెగా రెడ్డి, ఎంపీ మల్లు రవి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumara Swamy), గోపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు వేదికపై నూతన దంపతులు దండలు మార్చుకోక అతిధులు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
ఆదర్శ సురభి తల్లిదండ్రులు శ్రీమతి నరసమ్మ మరియు శ్రీ సత్తయ్య అతిధుల్ని ఆప్యాయంగా పలకరించారు. ఈనెల జులై 7న ఆదర్శ సురభి వివాహం నిపున్ తో
చండీఘర్ లోని హోటల్ మౌంట్ వ్యులో జరిగింది.
