
ఉప్పల్: రాచకొండ పోలీస్ కమిష నరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహి స్తున్న హెడ్ కానిస్టేబుల్ వి.మహేష్ (2539)కు రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాన్ని ప్రకటించింది. ఆయన చేస్తున్న సేవలకు గాను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పతకం ప్రకటించింది. ఈ సేవా పతకం రాచకొండ కమి షనర్ మహేశ్ భగవత్ చేతులమీదుగా హెడ్ కానిస్టేబుల్ మహేష్ అందుకున్నారు. సేవా పతకం అందుకున్న మహేష్ మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, ఉప్పల్ ఎస్ హెచ్బీ ఏసిపి రంగ స్వామి, సర్కిల్ ఇన్స్ పెక్టర్ గోవింద్ రెడ్డి, ఎస్సై లు జయరామ్, మై బెల్లిలతో పాటు పలువురు పోలీస్ ఆఫీసర్లు సిబ్బంది అభినందించారు.