మీ ఫోన్లో గూగుల్ క్రొం వర్షన్ ని చెక్ చేసుకోండి. అది వర్షన్ 98 కంటే ముందు ఉంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన CERT In హెచ్చరించింది. క్రోమ్ వర్షన్ 98.0.4758.80 కంటే ముందు వర్షన్ వాడుతున్న వాళ్లు మాత్రం వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
అసలు వీటివలన యూజర్లకు వచ్చిన నష్టం ఏంటంటే హ్యాకర్లు ఇలాంటి వర్షన్ లపై సులభంగా దాడి చేసే చాన్స్ ఉందని ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT In ఏజెన్సీ వివరించింది. సైబర్ నేరగాళ్ళు డేటాను దొంగలించి దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది.
ఆయితే ఈ వర్షన్ కంటే ముందు ఉన్న వాటిలో బగ్స్ ఉన్నాయని పేర్కొంది. ఈ బగ్స్ వలన యూసర్ కు ప్రమాదం పొంచిఉందని హెచ్చరించింది. దీని తర్వత వర్షన్ లలో గూగుల్ ఈ బగ్స్ ని ఫిక్స్ చేసింది.