మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు ఉన్నప్పటికీ స్థానికంగా నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. స్వచ్ఛమైన బంగారం పది గ్రాములకు రూ.100 తగ్గి రూ.31,050కు చేరుకుంది. వెండి కిలోకు రూ.130 తగ్గి రూ.39,820గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే ధర తగ్గుదలకు కారణమని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.