కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ స్కూల్ నడపాలి – జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి : తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేది నుండి పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్నందున ,ఈరోజు మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని కోవిడ్-19పై తగు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను పాఠశాలకు పంపవలసినదిగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అదేవిధంగా పాఠశాలలో కోవిడ్-19 నిబంధనలు విద్యార్థులు ఖచ్చితంగా పాటించే విధంగా చూడాలని మరియు అవసరమైనవారికి వెంటనే కరోనా టెస్టులు మరియు ఆరోగ్య స్థితిగతుల గురించి ANM లేదా ఆశ వర్కర్ల చేత అవసరమైన టెస్టులు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ హరిశంకర్ రెడ్డి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ గారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions