హైదరాబాద్ లో ఎండ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇంతకు ముందు ఒక వారం రోజులు చాలా తీవ్రంగా ఎండలు మండాయి. అయితే బుధవారం ఉదయం కురిసిన ఆకస్మిక వానల వలన జనాలు కాస్త ఊరట పడ్డారు. నిన్న అత్యధికంగా 37.6 డిగ్రీలు గా ఉంది. ఇది అంతకు ముందు నాలుగు రోజుల క్రితం వరకు దాదాపుగా 41 డిగ్రీలు ఉండేది. అంటే సుమారు నాలుగు డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి.
కనిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలు గా ఉన్నట్లు వాతావరణశాఖా అధికారులు తెలియజేశారు. ఉపరితల ద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ పైనుండి తమిళనాడు దాకా సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద అలాగే ఉందని, రాత్రి సమయాల్లో హైదరాబాద్ లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.