నిరంతరం విభిన్న వార్త కథనాలతో ప్రజలకు చేరువ అవుతున్న సూర్య ఉదయం తెలుగు దినపత్రిక ఆరొవ వార్షికోత్సవం సందర్బంగా కూకట్ పల్లి కేపీహెచ్ బి కాలనీ రమ్య గ్రౌండ్స్ వద్ద గల ప్రెస్ కార్యాలయం లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టియుడబ్ల్యూజే కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం.ఏ. కరీమ్ భాయ్ మరియు తోటి విలేకరుల సమక్షం లో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వార్ధ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా పక్షాన నిలబడి పాలకుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ అట్టడుగు స్థాయి వర్గాల వారి నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు జరుగుతున్న దోపిడీని అసమానతలను ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిజాలను నిర్భయంగా చూపించాలని, మీడియా రంగంలో మరింతగా అభివృద్ధిచెంది మరెన్నో వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవాలని, మంచి పేరు సాధించాలని కోరారు. అనంతరం సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఇంచార్జ్ బాషా మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు, ఇలాగే మీ ఆదరణ ఎల్లప్పుడు మాపై ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ రిపోర్టర్ ఎం.ఏ. కరీమ్, నజీర్, మాణిక్య రెడ్డి, గంగరాజు, రెహమాన్, క్రాంతి కుమార్, రాఘవేంద్ర, శ్యాంసుందర్, సైదులు, బెల్లం శంకర్, మహేందర్, కోటేష్, అంజి, మిత్రులు శివ బాలజీ ఎంటర్ప్రైజెస్ పేటరాజా, శ్రీనాథ్ రెడ్డి, రామ్ రెడ్డి, రవి, పెద్దిరెడ్డి రాంబాబు, చిన్నబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పార్లమెంట్లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ...
Read more