హైకోర్టుకు వేసవి సెలవులు: మే 3 నుంచి జూన్ 1వరకు
మే 3 నుంచి జూన్ 1వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచిలు ఏర్పాటు చేశారు. మొదటి వెకేషన్ బెంచిలో జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్, జస్టిస్ సునీల్ చౌదరితో కూడిన సింగిల్‌బెంచ్ మే 10, 17 తేదీల్లో అత్యవసర కేసులపై విచారణ చేపడుతుంది. రెండో వెకేషన్ బెంచిలో జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం, జస్టిస్ షమీమ్ అఖ్తర్‌తో కూడిన సింగిల్ బెంచి మే 22న కేసుల విచారణ చేపడుతుంది. అదేవిధంగా జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ షమీమ్ అఖ్తర్‌తో కూడిన ధర్మాసనం, జస్టిస్ శంకరనారాయణతో కూడిన సింగిల్ బెంచి మే 31న విచారణ చేపడుతుంది.