ఇద్దరు స్నేహితులు ఎంతో శ్రమించి అంధులు పడుతున్న ఎన్నో పాట్లకు పరిష్కారం చూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను జోడించి పనిచేసే కొత్త కళ్ళజోళ్ళను రూపొందించారు. నెదర్లాండ్స్‌తో మరియూ యూరప్‌లలో ఇది అత్యధిక ప్రజాధరణ పొందింది. చాలాకాలం నుండి అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది దారి చూపిస్తుంది.
ఈ ఎన్విజన్ కళ్లజోడు 8 మెగా పిక్సెల్ కెమెరా తో నిర్మితమైంది. ఇది ఎదురునుండి వస్తున్న దృశ్యాలను రికార్డ్ చేస్తుంది. మనకు అవసరమైన సమచారం కావాల్సి వచ్చినప్పుడు దీన్ని కొంచం టచ్ చేస్తే ముందు ఉన్న వస్తువులను, విషయాలను వారికి వినిపిస్తుంది. వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ సపోర్ట్, ఏఐ వంటి కొత్త ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నాయి. దీని సహాయంతో అంధులు నడవడం, వంటలు, ఫోన్లు, వీడియో కాల్స్ చేయడం, చదవడం వంటివి చేయవచ్చు.