కుల గణనతో సామాజిక న్యాయం సాధ్యం- జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

కుల గణనతో సామాజిక న్యాయం సాధ్యం- జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

జనాభా గణనలో కులగణన లెక్కలు తీస్తేనే బీసీల జీవితాలలో వెలుగులు

దేశంలో 130 కోట్ల మంది జనాభాలో…సింహ భాగం 70 కోట్ల మంది జనాభా ఉన్న బీసీలకు సామాజిక న్యాయం దొరకడం లేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. కులగణనతోనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందనేది అక్షర సత్యం‌ అని అన్నారు.ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేటు వద్ద కులగణన, సామాజిక న్యాయం సాధన కోసం ఓబీసీ సత్యాగ్రహం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా అందని ద్రాక్షలాగే ఉండిపోయింది కులగణన అనే అంశం. జనాభా గణనలో కులగణన లెక్కలు తీస్తేనే బీసీల జీవితాలలో వెలుగులు నిండుతాయి. అడవులలో జీవించే పులులు, కుక్కలు, నక్కలు, కోతులకు లెక్కలున్నాయి, కులాల వారీగ లెక్కలు లేకపోవడం చాలా దారుణమైన విషయమని దుండ్ర కుమారస్వామి అన్నారు.కులగణన వివిధ అసమానతలను తొలగించడానికి ఉపయోగపడుతుంది:
జనాభా గణనలో కులగణన లెక్కలు లేకపోవడం ద్వారా బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నష్టపోతున్నారు.. విద్యా ఉద్యోగ తదితర రంగాలలో ప్రస్తుతం ఎస్సీలకు 15% ఎస్టీలకు 7.5 బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.. 1931 నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు కోటాను ఇప్పటికీ పాటిస్తున్నాం. అయితే ప్రస్తుతం దేశంలో బీసీ జనాభా చాలా పెరిగిపోయింది.. 80 ఏళ్ల నాటి లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.. ఇది చాలా బాధాకరము… దీని వలన ఓబీసీలు సామాజిక అన్యాయానికి గురవుతున్నారు. దేశంలో సగభాగం, రాష్ట్రంలో సగభాగం వున్న బీసీ వర్గాలకు న్యాయం దక్కడం లేదు. కులగణన వివిధ అసమానతలను తొలగించడానికి ఉపయోగపడుతుందనే విషయం ప్రభుత్వాలు గుర్తెరగాలి. ఇప్పటివరకు రిజర్వేషన్లు అందుకోలేని కులాలకు మేలు చేయవచ్చు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం లభించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కులగణన డిమాండ్ ని బలపరచాలని కోరుతున్నామని తెలిపారు దుండ్ర కుమారస్వామి. కులగణన ప్రధాన లక్ష్యం కులాలవారీగా సామాజిక, ఆర్థిక విద్యాపరమైన గణాంకాలను అందించడమే. వివిధ కులాలు ఎదుర్కొంటున్న విశేష సౌకర్యాలు లోటు పాట్లను అర్థం చేసుకోవడానికి కుల గణన సహాయం చేస్తుంది. కుల గణన అనేది ఖచ్చితమైన డేటా, సమాచారాన్ని అందించడానికి, అసమానతలను తగ్గించడానికి, పేదరికం నిర్మూలించడానికి దోహదం చేస్తుందని దుండ్ర కుమారస్వామి అన్నారు.

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్న AIOBCSA, కుల గణన వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాల్సిన కీలకమైన అవసరాన్ని నొక్కి చెప్పింది. AIOBCSA జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్, అధికార పక్షం మరియు ప్రత్యేక సంఘాలు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పౌరులను కోరారు. దేశంలోని అతిపెద్ద సమూహం అయిన OBCలకు వారి సామాజిక ఆర్థిక మరియు విద్యా స్థితిపై సరైన డేటా లేకపోవడం వల్ల అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు రాకుండా ఉండడానికి కారణమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మద్దతుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, న్యాయవాద సంఘాలు, విద్యార్థి ఫెడరేషన్స్, ఇంటలెక్చువల్ ఫెడరేషన్, ఆలిండియా ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్, కొండలు, సాయి కిరణ్, ముక్తేశ్వర్ మల్లేష్ ,మురళి యాదవ్, లక్కీ ప్రవీణ్ శివ యాదవ్ పాల్గొన్నారు

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions