ఇన్‌స్టాగ్రామ్ IG TV ని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకుముందు యూట్యూబ్ నుంచి పోటీని తట్టుకునేందుకు వీడియోలను టార్గెట్ చేసి IG TV రూపొందించింది. కానీ అది యూజర్లను అంతగా ఆకట్టుకోలేక పోయింది. చాలా రోజులు మార్కెట్లో నిలబడడానికి ప్రయత్నించింది. కానీ చివరకు యూట్యూబ్ కి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు IG TV ఆప్ ను షట్డౌన్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
IG TV అంటే ఇన్‌స్టాగ్రామ్ టీవీకి షార్ట్ ఫామ్. ఎక్కువ నిడివి ఉన్న క్వాలిటీ వీడియోలు రూపొందించడానికి ఇంస్టాగ్రామ్ యూజర్లకు ఉపయోగపడేది. అయితే ఇందులోని బేసిక్ ఫీచర్లు ఇంస్టాగ్రామ్ ఆప్, వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ మెయిన్ ఆప్ లో కూడా అన్ని ఫీచర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ బ్లాగ్ లో వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లు కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో యాడ్స్ ఉంచబోతున్నామని తెలిపింది.