బొడుప్పల్ : తెలంగాణ రాష్ట్రం కరోనా కొరల్లో చిక్కుకుని ఆక్సిజన్ లేక బెడ్లు దొరకక పోవడం వల్ల రోజు ఎందరో ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన “సేవ్ హాస్పిటల్స్” సేవా దృక్పథంతో ముందుకొచ్చింది..
పిర్జాదిగుడా, మల్లికార్జున నగర్ లోని నెంబర్ 1 హాస్పిటల్ అయినటువంటి “సేవ్ హాస్పిటల్స్” (సేవ్ క్లినికల్ మరియు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), కరోనా కాటునుండి కాపాడేందుకు పేదలకు మరియు ఫ్రంట్-లైన్ వారియర్స్ కు ఒక చిన్న సామాజిక సేవను అందించాలనే ఉద్దేశ్యంతో మేము సైతం అంటూ తమ సేవా గుణాన్ని చాటుకున్నారు..
కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వగానే, రోగి మరియు వారి కుటుంబసభ్యులు ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేటువంటి మానసిక చికిత్స అందించడంలో “సేవ్ హాస్పిటల్స్” కీలక పాత్ర పోషిస్తుంది. అందుకుగాను
సేవ్ హాస్పిటల్స్ పేద ప్రజల చికిత్స కోసం కనీస ఛార్జీలతో ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
అదేస్పూర్తితో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిన సేవ హాస్పిటల్స్… కరోనా బారినపడిన వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, పేదప్రజలకు మరియు ఫ్రంట్-లైన్ వారియర్స్ కోసం 3 పడకలను ఉచితంగా ఉపయోగించాలని యాజమాన్యం నిర్ణయించింది.
ఇందులో హాస్పిటల్ సర్వీస్ ఛార్జీలు, ఆక్సిజన్ ఛార్జీలు ఆహార ఛార్జీలు, బెడ్ ఛార్జీలు లేకుండా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం అని “సేవ్ హాస్పిటల్స్” మ్యానేజింగ్ డైరెక్టర్ సామ రాజీ రెడ్డి గారు తెలిపారు.
రోగులు ఫార్మసీ మరియు ల్యాబ్ ఛార్జీలను మాత్రమే భరించాలి అని అన్నారు. ప్రస్తుతం మనకు 24 పడకలు మాత్రమే ఉన్నాయి, వీటిని కోవిడ్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నాము. ఇందులో పేద ప్రజలు మరియు ఫ్రంట్-లైన్ వారియర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే సేవా స్పూర్తితో 10 శాతంగా, 3 బెడ్స్ ఉచితంగా అందిస్తున్నాం అని MD రాజీ రెడ్డి అన్నారు..
రాష్ట్రంలో రోజు ఎంతో మంది హాస్పిటల్లో బెడ్స్ దొరకక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, సేవ స్ఫూర్తి తో ముందుకు రావడం పట్ల “సేవ్ హాస్పిటల్స్” యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ… ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేటున్నారు బొడుప్పల్ వాస్తవ్యులు..
NOTE : ఈ కోటాను ఉపయోగించుకోవడానికి ఫ్రంట్-లైన్ వారియర్స్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా పేర్కొన్నారు. అలాగే పేద ప్రజల కోసం, స్థానిక ప్రజా ప్రతినిధి నుండి ఒక లేఖ తప్పనిసరి అని తెలియజేశారు..