surviving-a-plane-crash

సిరియా ఎయిర్‌ బేస్‌ లో రష్యా విమానం కూలి 32 మంది మృతి

సిరియాలో హ్మెమీమ్‌ ఎయిర్‌ బేస్‌లో రష్యాకు చెందిన ఓ విమానం కూలిపోయింది.

26 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో ఉన్న ఓ రవాణ విమానం మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కుప్పకూలిపోయింది. రన్‌వేకు 500 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణికులందరూ మృతి చెందినట్లు భావిస్తున్నారు. సాంకేతిక లోపాల వల్లే ఈ విమాన ప్రమాదం జరిగిందని రష్యా తెలిపింది. విమానంపై ఎటువంటి దాడి జరగలేదని స్పష్టంచేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఇది ఎన్‌-26 రకం రవాణా విమానంగా భావిస్తున్నారు. ఈ విమానంలో సిబ్బంది కాకుండా 38 మంది ప్రయాణించగలరు. దీంతో పాటు 5.5టన్నుల కార్గోను కూడా రవాణా చేయవచ్చు.

russia-jet-syria-crash

2015 జనవరిలో కూడా రష్యాకు చెందిన ఏఎన్‌-26 విమానం సిరియాలో కూలిపోయింది. అప్పట్లో ఈ విమానాన్ని సిరియా సైన్యం నడుపుతోంది. అప్పట్లో ఈ ఘటన అబూ అల్‌ దుహార్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

 

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions