ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపిగా ఆర్పీ ఠాగూర్
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపిగా ఏసీబి డిజీగా పనిచేస్తున్న ఆర్పీ ఠాగూర్ పేరును శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటన చేయడం వెనువెంటనే ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగిపోయింది. చాలాకాలంగా ఆర్పీ ఠాగూర్ పదవి విరమణ చేస్తున్న మాలకొండయ్య అనంతరం డిజిపిగా కొనసాగుతారని ప్రచారం జరగడం అందరూ ఊహించిన విధంగానే ఆయన పేరు ఖరారైంది. ఠాగూర్‌కి వివాదరహితుడిగా పేరు ఉంది. గత రెండు రోజులుగా సర్చే కమిటి డిజీపీ ప్యానల్‌ను తయారీకి దశలవారీగా కసరత్తు అనంతరం సిఎంకు ఇచ్చిన నివేదికలోఉన్న ఠాగూర్ పేరును ప్రకటించారు. ఈయన 2016నవంబర్ 19నుంచి ఎసీబీ డిజీపిగా పనిచేస్తూ రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.ఈయన 1961జూలై 1న జన్మించి ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి 1986లో ఐపిఎస్ అధికారిగా ఎంపికైయ్యారు.అనంతరం రామ్ ప్రవేశ్ ఠాగూర్ (ఆర్పీ ఠాగూర్) అదే ఏడాది డిసెంబర్‌లో ఐపిఎస్ బాధ్యతలు చేపట్టారు.