Press note; 02/03/2023
ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతి పై స్పందించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు.. సమస్యలకు చావు పరిష్కారం కాదన్న దుండ్ర కుమార స్వామి
ఆందోళనకు గురి చేస్తున్న విద్యార్ధుల ఆత్మహత్యలు
ఈ పోటీ ప్రపంచంలో చదువు ఎంత ముఖ్యమో మానసిక ధైర్యం కూడా అంటే ముఖ్యం
నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతి పై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి స్పందించారు. లక్షల్లో డబ్బులు కుమ్మరించి కొంటున్న చదువులు విద్యార్ధుల ప్రాణాల పాలిట యమపాశంలా మారుచున్నాయని, రోజురోజుకు విద్యార్ధుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకు గురిచేస్తుందని తెలిపారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారని కుమార స్వామి విచారం వ్యక్తం చేశారు. సాత్విక్ మృతికి కారకులైన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత యాజమాన్యం పై ఉందని దుండ్ర కుమార స్వామి తెలిపారు. శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకుల ఆశ చూపి విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకొంటు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని దుండ్ర కుమార స్వామి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.. ఈ పోటీ ప్రపంచంలో చదువు ఎంత ముఖ్యమో మానసిక ధైర్యం కూడా అంటే ముఖ్యం అన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి ఆ దిశగా విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన బాధ్యత విద్యాసంస్ధల పై ఉందని కుమార స్వామి అన్నారు. సమస్యలకు చావు పరిష్కారం కాదని మనో ధైర్యంతో సమస్యను ఎదుర్కొనడం అలవాటు చేసుకొంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తెలిపారు.