కొన్ని సినీ ఇండస్త్రీలోని సమస్యలను చర్చించుకోడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)- సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించారు. చెన్నై లో శనివారం, ఆదివారం ఈ మీట్ ఉంటుంది. ముఖ్య అతిథిగా సీఎం స్టాలిన్ ఈ సమ్మిట్‌ను ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రాజమౌళి, మణిరత్నం, సుకుమార్, నటులు రమేష్ అరవింద్, జయరామ్ రవి, సుహాసిని, ఖుష్బూ పాల్గొన్నారు.
‘రీజనల్ ఈజ్ ది న్యూ నేషనల్- వే ఫార్వాడ్ ఫర్ ది సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ’ అనే నివేదికను స్టాలిన్ విడుదల చేశారు. నేను ప్రతి కథను లార్జర్ దెన్ లైఫ్‌గా తెరకెక్కించేందుకే ఇష్టపడతానని దర్శకుడు రాజమౌళి చెప్పారు. సినిమా చిన్నదా, పెద్దదా అనే సంబందం లేదనీ, మంచి కథ ముఖ్యమని తెలిపారు.
మణిరత్నం మాట్లాడుతూ “ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఇప్పటి తరానికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. తమ ఫోన్లలోనే సినిమాను తీసి ప్రతిభను చూపిస్తున్నారు. పెద్ద కథను రెండు భాగాలుగా తీసి సక్సెస్ చేయడంలో రాజమౌళి నాకు స్ఫూర్తిగా” అన్నారు.