బడుగుల జీవితాల్లో మార్పు కోసం నడుం బిగించిన రాహుల్ గాంధీ.

బడుగుల జీవితాల్లో మార్పు కోసం నడుం బిగించిన రాహుల్ గాంధీ.

కులగణన తో సామాజిక అసమానతుల విముక్తి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను బీసీగా చెప్పుకుంటున్నా , ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదు. ఈ దేశంలో బీసీల కోసం తన గలాన్ని వినిపిస్తున్న ఏకైక నేత కాంగ్రెస్ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ మాత్రమే. బీసీ తానని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ బీసీలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఆయన బీసీల ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీసీలను నిలువునా మోసం చేస్తున్నారు.

బీసీల వాయిస్ ను పట్టించుకోవట్లేదే:

కుల గణన కోసం రాహుల్ గాంధీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రాంతాల్లో ఈ విషయమై తన వాయిస్ ను వినిపించారు. కుల గణన కోసం కాంగ్రెస్ డిమాండ్‌ చేసినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముందుగా కుల గణన చేపడదామని, అలా చేసి వెనుకబడిన కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర కులాల జనాభా, స్థితిగతులను కచ్చితంగా తెలుసుకోవచ్చని స్పష్టంగా రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే ప్రారంభమవుతుంది. ఈ వర్గాలకు వారి జనాభా ఆధారంగా భారతదేశ సంపద, ఉద్యోగాలు, ఇతర సంక్షేమ పథకాలను పంపిణీ చేయడానికి చారిత్రాత్మక బాధ్యతను తీసుకుంటామని రాహుల్ గాంధీ చెబుతున్నారు.

భారతదేశ జనాభాలో వెనుకబడిన కులాలు 70% పైగానే ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద కంపెనీలు, ఇతర రంగాలలో వీరికి తక్కువ వాటా ఉందని రాహుల్ గాంధీ ఎప్పటి నుండో వాదిస్తూ వస్తున్నారు. పచ్చిగా మాట్లాడుకుంటే భారత జనాభాలో 90% మందికి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడంలో అసలైన భాగస్వామ్యం లేదనే బాధ వెంటాడుతూ ఉంది. ఈ విషయం రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా కూడా కేంద్రం వినకపోవడం నిజంగా బాధగా ఉంది. ఒక బాధ్యతగా ఆయన చెబుతూ ఉన్నా కూడా కనీసం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి పునాది. తెలంగాణలో కుల ప్రాతిపదికన జనాభా గణనకు రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు తెలిపారు. కుల ప్రాతిపదికన జనాభా గణన కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా రాహుల్ గాంధీ సంకల్ప బలమే.

బిజెపి పై నమ్మకం పోయింది:

నరేంద్ర మోదీ హయాంలో గత దశాబ్దంలో హిందూ జాతీయవాదం భారతదేశంలో ఆధిపత్య రాజకీయ సిద్ధాంతంగా మారింది. బీజేపీ మతపరమైన ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే భారతీయులందరినీ ప్రభావితం చేసే సామాజిక సమస్యలపై దృష్టి పెట్టలేకపోవడం కూడా బీజేపీ సమస్యగా చెప్పుకోవచ్చు. అందుకే బీసీలు క్రమక్రమంగా బీజేపీకి దూరమవుతూ ఉన్నారు. గత రెండు టర్మ్ లలో బీసీలకు ఎలాంటి మంచి చేయలేని బీజేపీ ఈ టర్మ్ లో కూడా మంచి చేస్తుందనే నమ్మకం ఇప్పటికే పోయింది. అందుకే ఇకపై బీసీలు క్రమక్రమంగా బీజేపీకి దూరమయ్యేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. బీజేపీ తీరు మార్చుకుంటే బాగుపడుతుంది.. లేదంటే పాతాళానికి పడిపోవడం పక్కా అని మాత్రం బీసీ నేతగా హామీ ఇస్తున్నాను.

సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్??

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) కోటాను పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటాను పెంచే ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను అందజేయాలని గతంలోనే అధికారులను ముఖ్యమంత్రి కోరారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చేస్తున్న సన్నాహాలను అధికారులు వివరించారు.

బీసీ కుల గణన ప్రక్రియపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ను తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో కమిషన్‌ చైర్మన్‌ జి నిరంజన్‌, సభ్యులతో ఇటీవల జరిగిన సమావేశంలో కుల గణన కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాల్సిన ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో సంభావ్య చట్టపరమైన అడ్డంకులను నివారించడం కూడా చాలా ముఖ్యమని రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కసరత్తును వీలైనంత త్వరగా ప్రారంభించాలని రేవంత్‌రెడ్డి కమిషన్‌ను కోరడం శుభపరిణామం. బీసీల గణనను సమర్ధవంతంగా, సకాలంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందని కమిషన్‌కు హామీ ఇవ్వడం కూడా మంచిది.

2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన కోసం ప్రణాళికలను ప్రకటించి తన నిబద్ధతను చాటుకున్నారు. ఫిబ్రవరి 2024లో, రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చొరవకు మద్దతుగా రూ.150 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ చురుకైన చర్యలు అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, విధాన రూపకల్పన, సాంఘిక సంక్షేమ పథకాల అమలు కోసం కీలకమైన డేటా దక్కుతుంది. ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడంతో పాటు సమగ్రమైన, చట్టబద్ధమైన కుల గణనను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా బీసీల రిజర్వేషన్ల వాటాను త్వరితగతిన నిర్ణయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయడానికి, బీసీ జనాభాను నిర్ణయించడానికి కుల గణన తప్పనిసరి, ఇది భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులను నివారించడంలో సహాయపడుతుంది. వీలైనంత త్వరగా కులగణన జరిగితే బీసీలకు ఎంతో మంచి జరగనుంది.

దుండ్ర కుమారస్వామి-జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions