బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలో కులగణన మొదలవ్వడానికి అసలైన కారణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల కారణంగా నేడు కులగణన రాష్ట్రంలో మొదలైంది. పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శేర్లింగంపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
బీసీలు బాగుపడాలంటే కులగణనతోనే సాధ్యమంటూ బలంగా నమ్మిన వ్యక్తి, శక్తి రాహుల్ గాంధీనే!! ఆయనే కానీ లేకపోయి ఉంటే ఈరోజు ఈ అడుగు పడి ఉండేదా అనే అనుమానాలు కలగకమానవు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంతగానో ఆలోచించి ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా కూడా ఆయన తన నిర్ణయం మారదంటూ తేల్చి చెప్పారు.
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విషయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిర్ణయాలు కూడా అభినందనీయం. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ సర్వేలో సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను నిర్వహించేలా ఆయన పటిష్ట చర్యలను తీసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 1,17, 44,000 ఇళ్లకు సర్వే చేయనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్ళు కేటాయించారు, కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం తీసుకుంటారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నమే ఈ సర్వే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారంతో భవిష్యత్‌లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుందన్నది తెలుసుకోవాలి. బీసీల అభివృద్ధికి ఈ సర్వే ఖచ్చితంగా ఓ కీలక మలుపుగా మారుతుందని జాతీయ బీసీ దళ్ ఆశిస్తూ ఉంది తెలిపారు .ఆయనతో రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ వి వెంకటరమణ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
.