ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ కూతురు హర్షిత, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రుబియా కౌర్ సిద్ధూ, వీరిద్దరూ తండ్రుల తరపున ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరూ తమ తండ్రుల గొప్పదనాన్ని వివరిస్తూ చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. పంజాబ్ ఎన్నికల్లో వీరి ప్రసంగాలు ప్రజలనూ, మీడియానీ ఆకర్షిస్తున్నాయి.
వీరి వయసు చిన్నదే అయినా తండ్రులపై సెంటిమెంట్ వ్యాఖ్యలను విసిరి తండ్రులపై అభిమానాన్ని చాటుతున్నారు. సిద్ధూ పోటీ చేస్తున్న అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గంలో రుబియా ప్రచారం చేస్తున్నారు. ఈమె సింగపూర్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివి వచ్చింది. సిద్ధూను సీఎం అభ్యర్థిగా చేయకపోవడంపై ఆమె కన్నీరు పెట్టుకున్నారు. జనాదరణ , నిజాయితీతో మెలిగే వ్యక్తి సీఎం అభ్యర్థి కాలేదు. ఇకముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి అంటూ ప్రచారం చేస్తున్నారు.
కేజ్రివాల్ కుమార్తె హర్షిత ఆప్ భగవంత్ మన్ తరఫున ధురిలో ప్రచారం చేస్తున్నారు. తన తండ్రి పంజాబ్ బాల బాలికల గురించి ఎక్కువగా తపిస్తారనీ, వారు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే భవిష్యత్తు తరాలు బాగుంటాయని అన్నారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన తాను, తన ఫ్రెండ్స్ లాగా విదేశాలు వెళ్ళలేదనీ, తన తండ్రి చెప్పినట్టుగా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.