phd-rules-cahnged-at-jntu

జేఎన్‌టీయూ లో ఆరు సంవత్సరాలల్లోనే ఖచ్చితంగా పీహెచ్‌డీ పూర్తి చేయాలి

జేఎన్‌టీయూ యూనివర్సిటి రీసర్చ్ & డెవ్‌లప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో పీహెచ్‌డీ కొరకు కొత్త అకడమిక్‌ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవి ఈ విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వస్తాయని వర్సిటీ జేఎన్‌టీయూసంచాలకులు ప్రొ.కె.విజయ్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఆరేళ్లలోనే పీహెచ్‌డీ పూర్తిచేసేలా జేఎన్‌టీయూ స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. యూజీసీ నిర్దేశించిన నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీని ప్రకారం ఆరేళ్లలోనే పీహెచ్‌డీ పూర్తి చేయాలని వారు తెలిపారు.ఇంతకు ముందు పీహెచ్‌డీ స్టూడెంట్స్ కు ప్రీ పీహెచ్‌డీ పద్ధతి ఉండేది. వారు 2 సబ్జెక్టులు సెలక్ట్ చేసుకునేవారు. ఇప్పుడా దాన్ని రద్దుచేసి. 4 కోర్సు వర్క్‌లు చేయాలని తెలిపారు.

ఇంటర్నల్స్‌, ఎక్స్‌టర్నల్స్‌ పరీక్షలు 30:70 గా ఉంటాయి. ఇంతకు ముందు 3 పబ్లికేషన్స్‌, ఒక జర్నల్‌ పేపర్‌ ప్రచురితమైతే అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు 4 జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురిణ పొందాలి.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions