తెలంగాణ రాష్ట్ర సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎం కె.చంద్రశేఖర్ రావును ఇవాళ ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేశారు. వారి వినతి పత్రాన్ని అందుకున్న సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, కార్మిక నాయకులు, వెంకట్రావు, రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పార్లమెంట్లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ...
Read more