ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేస్తుంది: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
మహా శివరాత్రి సందర్భంగా పలు ప్రాంతాలలో నిర్వహించిన కార్యక్రమాలకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. బుధవారం రోజు కైతలాపూర్ గ్రౌండ్స్ కూకట్ పల్లిలో శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఆధ్వర్యంలో జాగరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, కాంగ్రెస్ నేత బండి రమేష్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా కైతలాపూర్గ్రౌండ్స్లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ప్రశంసించారు. ఆ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను పునీతులు చేశారని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు అహోరాత్ర అభిషేకం నిర్వహించారు . 108 నదుల నుంచి తీసుకువచ్చిన గంగా జలంతో పూజలు నిర్వహించారన్నారు దుండ్ర కుమారస్వామి. ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేస్తుందని, ఆత్మలోని బలహీనతలను, రుగ్మతులను విముక్తి చేస్తుందని దుండ్ర కుమారస్వామి ఈ సందర్భంగా తెలిపారు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అసూయ, ద్వేషము, భయము వంటి బలహీనతలు మనం తప్పకుండా విడనాడాలని కోరారు. ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి, సామాజిక బంధాలను బలపరచడానికి, సమాజంలో శాంతి, సంతోషాన్ని వ్యాప్తి చేయడానికి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారన్నారు దుండ్ర కుమారస్వామి.
