ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం ఈరోజు ఉదయం కొలువుదీరనుంది. గత 3 రోజుల నుండి దీనిపై పనిచేస్తున్న సీఎం జగన్ నిన్న సాయంత్రం కొత్త మంత్రులను ఖరారు చేశారు. కొత్త మంత్రులకు సీఎం కార్యాలయం నుండి కొందరు అధికారులు ఫోన్ చేసి వారికి సమాచారాన్ని తెలిపారు. ఈరోజు ఉదయం 11గంటల 31నిమిషాలకు కు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జరుపుతారు.
కొత్త మంత్రి వర్గం:
- శ్రీకాకుళం – ధర్మన ప్రసాద రావు (వెలమ)
సీదిరి అప్పలరాజు (మత్యకార) - విజయనగరం – బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
- పార్వతీపురం – రాజన్న దొర (ఎస్టీ)
- విశాఖ – గుడివాడ అమర్నాధ్ (కాపు)
ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ) - కాకినాడ జిల్లా – దాడిశెట్టి రాజా (కాపు)
- కోనసీమ జిల్లా – పినిపె విశ్వరూప్ (ఎస్సి)
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసి – శెట్టి బలిజ) - తూర్పుగోదావరి జిల్లా – తానేటి వనిత (మాదిగ – ఎస్సీ)
- పశ్చిమ గోదావరి జిల్లా – కారుమూరి నాగేశ్వరరావు (యాదవ – బీసి)
కొట్టు సత్యనారాయణ (కాపు) - కృష్ణా జిల్లా – జోగి రమేష్ (గౌడ – బీసి)
- గుంటూరు జిల్లా – అంబటి రాంబాబు (కాపు)
మేరుగ నాగార్జున (మాల)
విడదల రజని (బీసి – రజక) - నెల్లూరు జిల్లా – కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసి – రెడ్డి)
- కడప జిల్లా – అంజద్ బాషా (మైనార్టీ)
- కర్నూలు జిల్లా – బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసి – రెడ్డి)
గుమ్మనూరు జయరాం (బీసి – బోయ) - *చిత్తూరు జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసి – రెడ్డి)
- నారాయణ స్వామి (ఎస్సీ)
- ఆర్ కే రోజా (ఓసీ – రెడ్డి)
- అనంతపురం – ఉషా శ్రీ చరణ్ (కురుప బీసి)
తిప్పే స్వామి (ఎస్సీ)