ఎం.సి.సి.ఐ. క్రికెట్ రూల్స్ లో కొన్ని సవరణలను చేసింది. నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే బౌలర్ స్టంప్స్‌ను పడగొట్టి అతణ్ని ఔట్ చేస్తే దాన్ని మన్కడింగ్ అని అంటారు. దాన్ని ఇన్నిరోజులవరకూ అన్యాయమైన ఆటగా, చట్టబద్ధం కానిదిగా పరిగణించేవారు. దానిపై అనేక చర్చలు వివాదాలు జరిగేవి. అయితే ఇప్పుడు ఎం.సి.సి.ఐ. నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్ చేయడం అంటే చట్టం 41 (అన్యాయమైన ఆట) నుండి తొలగించి, చట్టం 38 (రనౌట్) గా పరిగణిస్తుంది. ఆ చట్టం పేరులో మార్పు లేదని ఎం.సి.సి.ఐ. పేర్కొంది.
దీనితోపాటు మరో మార్పు కూడా చేసింది. బంతిపై ఉమ్ము రుద్దడాన్ని కరోణా వలన నిషేధించింది. కానీ ఇప్పుడు ఉమ్ము రుద్దడాన్ని శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
ఈ సవరణల పై క్రికెట్ దిగ్గజాలనుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ ఈ సవరణలను సపోర్ట్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ సవరణలను విమర్శిస్తున్నాడు. నైపుణ్యం లేని పని (మన్కడింగ్) ని ఎలా చట్టబద్ధం చేస్తారని అంటున్నాడు.