మిస్సైల్ మాన్, మాజీ రాష్ట్రపతి శ్రీ.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళిగా ప్రారంభించిన ఇగ్నిటింగ్ మైండ్స్ ‘హరా హై తో భరా హై’ అనే గ్రీన్ చాలెంజ్ లో భాగంగా ప్రతి వ్యక్తి 3 మొక్కలు నాటి వాటిని తదుపరి 3 సంవత్సరాలు పరిరక్షించాలి. అలా ప్రారంభమైన గ్రీన్ చాలెంజిని స్వీకరించిన శ్రీ.ఎన్.బలరాం ఐ.ఆర్.ఎస్. గారు ఇప్పటివరకు 3500 మొక్కలకు పైగా నాటారు. ఈ సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి కాలరీస్ ఒక కోటి మొక్కలు నాటడం ధ్యేయంగా పెట్టుకొని కేవలం ఒక్కరోజే శ్రీరాంపూర్ ప్రాజెక్ట్స్ ఏరియా లో ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్ మొత్తం 20,000 మొక్కలకు పైగా నాటగా బలరాం ఒక్కరే ఒకే ఒక గంట లో అత్యధికంగా 1237 మొక్కలు నాటి ‘హైరైస్ వరల్డ్ రికార్డ్స్’ లో తన పేరు లిఖించుకోని భావి తరాల భవిష్యత్తు కొరకు సామాజిక అడవుల పెంపకం యొక్క ఆవశ్యకతను మాటల్లో కాకుండా తన చేతల ద్వారా చాటి చెప్పారు. అంతే కాకుండా ఆగష్టు 15, 2019 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం, రామవరం లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు 516 మొక్కలు నాటి ఇతరులకు స్ఫూర్తి గా నిలిచారు.
మొక్కలు నాటడంలో వీరి నిభద్దతను గుర్తించిన ప్రకృతి ప్రేమికులు, సామాజిక వేత్త, బి.సి.దళ్, రాష్ట్ర అధ్యక్షులు అయిన శ్రీ.దుండ్ర కుమారస్వామి గారు వారి నుండి స్పూర్తి పొంది ‘గ్రీన్ చాలెంజ్’ ని స్వీకరిస్తూ శ్రీ.బలరాం గారిని మర్యాద పూర్వకంగా కలుసుకొని ఒక మొక్కను బహుకరించి సత్కరించారు.
వేగంగా అంతరిస్తున్న అటవీ విస్తీర్ణం, నానాటికి పెరిగిపోతున్న భూతాపం పరిస్థితుల్లో ప్రకృతి వికోపానికి గురికాకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున అటవీ విస్తీర్ణం పెంచుకోక తప్పదు. కేవలం ఈ విషయంలో ప్రభుత్వాలే భాద్యత తీసుకోవలసిన అవసరం లేదు, పౌర సమాజం అంతా కలసి కట్టుగా వారి వారి పరిధిలో కనీసం 3 మొక్కలు నాటి వాటిని 3 సం.లు పరిరక్షిస్తే ఆ మూడు మొక్కలు పెద్దవై ఒక మనిషి జీవిత కాలానికి సరిపడా ప్రాణవాయువు ను ఉచితంగా అందించడమే కాదు, ప్రకృతి సమతుల్యానికి కుడా తోడ్పడుతాయి.