బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు -జాతీయ బీసీ దళ్ మరియు అనుబంధ సంఘాలు

లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కే మద్దతు జాతీయ బీసీ దళ్ మరియు అనుబంధ సంఘాలు

బీసీల అభివృద్ధి తోడ్పడే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy)

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి(congress party) మా సంపూర్ణ మద్దతు ఉంటుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈరోజు బుధవారం నాడు ఉదయము జాతీయ బీసీ దళ్(BC Dal) దానికి అనుబంధ సంఘాలు, వివిధ విభాగాలు నాయకుల బృందంతో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి మద్దతు ప్రకటిస్తూ లేఖను అందజేయడం జరిగింది. ప్రభుత్వము ఏర్పడిన 100 రోజుల లోపే బీసీ కులాలకు 37 కార్పొరేషన్ లను ఏర్పాటు చేసిన ఘనత రేవంత్ (CM Revanth)ప్రభుత్వందె అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సామాజిక ఆర్థిక కులగణనకు ముందుకు రావడం,

National BC Dal President Dundra Kumaraswamy said full support BC to congress parties :the development of Possible by Congress party’


కులగణన చేపట్టడానికి ఉత్తర్వులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు. బీసీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో రాణించాలంటే కుల గణనా చాలా ప్రాముఖ్యమైనదని తెలిపారు.
భవిష్యత్తులో బీసీలకు అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం తెలపడం ఇంతకన్నా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఏమి కావాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు .త్వరలో 17 లోక్ సభ నియోజకవర్గాల వారిగా తమ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీసీలను సమయయత్నం చేసి సమావేశాలు ఏర్పాటుచేసి, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. వేముల నరేందర్ రెడ్డిని కలిసిన ప్రతినిధి బృందంలో గాంధీ నారాయణ, సింహాద్రి , వెంకటరమణ, రాజారాం,విద్యార్థి విభాగం సాయి యాదవ్, మహిళా విభాగము, కార్మిక విభాగం అధ్యక్షులు తో పాటు వివిధ కుల సంఘాల చెందిన ప్రతినిధులు ఉన్నారు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions