ఈరోజు ట్విట్టర్ లో నార లోకేష్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు. #HBDnaralokesh అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఉదయం ఆరు గంటలనుండి వరుసగా మూడు గంటలు ట్రెండింగ్ లో ఉంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదినాన్ని తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఆయన కృష్ణ జిల్లా చల్లపల్లి లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు.
అవనిగడ్డలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.గుంటూరులో జరిగిన వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో సంబరాలు చేసుకున్నారు. నిమ్మాడ లో జరిగిన వేడుకల్లో పార్టీ ఏ.పి. అధ్యక్షుడు అచ్చం నాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు లోకేష్ నాయుడు పేర్కొన్నారు. విజయనగరంలో సీనియర్ నేత అశోకగజపతి రాజు లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూల్ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బాణాసంచా కాల్చి వేడుకలు జరిపారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు