సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సైతం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందిస్తూ వస్తుంది అయితే 2015 నుండి 2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులలో సైబరాబాద్ కమీషనరేట్ నుంచి 74 మందికి సేవా పతకాలు,34 మందికి అతి ఉత్కృష్ట పతకాలు,46 మందికి ఉత్కృష్ట పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసు జాయింట్ కమీషనర్ అవినాశ్ మహాంతి చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకం, అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్.రాత్రి పగలు కష్టపడి పనిచేసి మెడల్స్ సాధించినందుకుగాను తెలంగాణ ప్రభుత్వం,తెలంగాణ పోలీసు తరుపున అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ట్రాఫిక్ డిసిపి టి. శ్రీనివాస్ రావు, సిఏఆర్ ఎడిసిపి రియాజ్, ఏసిపిలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
