జ్వరం, ఇన్ఫెక్షన్, హ్రుదయ సంబంధిత వ్యాధులు, బి.పి., చర్మవ్యాధులు, ఎనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర మందుల ధరలన్నీ ఏప్రిల్ ఫస్ట్ నుండి పెరుగనున్నాయి. అంతేకాక ఎక్కువగా వినియొగలో ఉండే పారాసిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి మందుల ధరలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
మల్టీ విటమిన్ల ఔషధాల ధరలు కూడా పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు.ఏప్రిల్ ఒకటో తేదీ నుంండి ఈ మందుల ధరలు 10.76 % వరకు పెంచుకోవచ్చని కేంద్రం అనుమతినిచ్చింది. దేశంలో మందుల ధరల పెంపు గత రెండేళ్లుగా జరుగుతోంది. కరోనా మొదలైనప్పటి నుంండి ఇప్పడివరకూ వివిధ మందుల ధరలు దాదాపుగా 20% వరకు పెరిగాయి.