రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, తారా నగర్ లో గ్రంథాలయ స్వంత భవనాలులేక మరియు కందుకూరు డివిజన్ లో గ్రంథాలయం అనుకూలంగా లేకపోవడంతో పాఠకులకు గ్రంథాలయ సేవలు అందించలేక పోతున్నాం.నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని స్వంత స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు అని పాండురంగా రెడ్డి కోరారు. గ్రంథాలయ సేవలు ప్రజలకు చేరువవ్వలి మరియు శిథిలావస్థలో వున్న పురాతన గ్రంథాలయ భవనాలు అందులో ఇరుకైన గదులు ఉండడంతో , పాఠకులకు అసౌకర్యంగా వుండి అనుకూలంగా లేక,అద్దె భవనాలలో ఉన్నా వాటిని కూడా సరైన వసతులు కల్పించాలని కోరారు నిలుపేదలకు దోహద పడాలనినూతన గ్రంథాలయాల నిర్మించాలని కెసిఆర్,కెటిఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో శాసన సభ్యులు అరికెపూడి గాంధీ కోరిక మేరకు శేరిలింగంపల్లి,తారా నగర్ మరియు కందుకూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులతో నూతన భవనాలు నిర్మించుటకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకు కలెక్టర్ అమోయ్ కుమార్ సానుకూలంగా స్పందించి సంభందిత తహసీల్దార్లను స్థల పరిశీలన చేయుటకు ఆదేశించారని,కప్పాటి పాండు రంగారెడ్డి తెలిపారు.సమీకృత కలెక్టర్ కార్యాలయంలొ మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారని పాండురంగారెడ్డి తెలిపారు.గ్రంధాలయ స్థలాలు కేటాయించిన తర్వాత అన్ని వసతులతో,నూతన హంగులతో, అధునాతన భవనాలు నిర్మిస్తామని గ్రంధాలయ సంస్థ చైర్మన్ కప్పటి పాండురంగా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి యం.మనోజ్ కుమార్ సిబ్బంది సత్యనారాయణ పాల్గొన్నారు
