తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ గారిని మరియు బీసీ కమిషన్ సభ్యులతో కూడిన పాలకమండలిని నియమించినందుకు, బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి గారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బిసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న కమిషన్ లేకపోవడం వల్ల బీసీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని అనేక మార్లు ప్రభుత్వానికి మరియు పత్రికల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారని, దానికి స్పందించి ప్రభుత్వం పాలకమండలిని నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ గారికి, బీసీ కమిషన్ సభ్యులకు కుమార స్వామి శుభాకాంక్షలు తెలిపారు. బీసీల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.