- అయ్యా భర్త లేని దాన్ని ఆదుకోండి..
- అద్దె ఇంట్లో ఉండి కిరాయిలు కట్టలేక పోతున్న..
- ఇద్దరు పిల్లలను పోషించలేక పోతున్నా..
- డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆదుకోండి సారు
- మంత్రి కేటీఆర్ కాళ్ళపై పడి బోరున విలపించిన మహిళ విచారణ జరిపి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు కేటీఆర్ ఆదేశాలు.
- అర్హురాలు అయితే సీఎం చేతుల మీదుగా ప్రెసిడెంట్ లెటర్ రేపు ఇప్పించాలని ఆదేశాలు.
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వేముల కవిత భర్త సదానందం ను కోల్పోయి ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తుంది. శనివారం సిరిసిల్ల కి వచ్చిన మంత్రి కేటీఆర్ ను కలిసి కాళ్లపై పడి భోరున విలపించింది. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని వేడుకుంది. దీంతో చేయించిన మంత్రి కేటీఆర్ మున్సిపల్ కమిషనర్ ను పిలిచి… విచారణ జరిపి … వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
సమస్య ఉంటే నేరుగా చెప్పాలని ఇలా కాళ్లపై వారు పడవద్దని కేటీఆర్ పేర్కొన్నారు. అన్నం తిని వచ్చారా అమ్మ అని అడిగా… సార్ పొద్దున్నుండి ఇక్కడే ఉన్నాం ఇంకా తినలేదు అనడంతో… వెంటనే తన సిబ్బందిని భోజనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యాంప్ ఆఫీస్ లోనికి తీసుకెళ్ళి మరి భోజనం పెట్టించి ముగ్గురు అర్జీదారుల సమస్యలు పరిష్కరించి పంపించారు. ఒక్కోసారి మంత్రి కేటీఆర్ స్పందించే తీరు అందరి .. మన్ననలు పొందుతాయి.