సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో అనతికాలంలోనే ఎంతో మందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారినటువంటి ఖేడ్ బ్లడ్ డోనర్స్ ఈరోజు మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. వివరాల్లోకి వెలితే..
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం తక్కువగా ఉండి చికిత్స పొందుతున్న టీ.లింగపల్లి గ్రామానికి చెందిన గొల్ల ఆడివయ్యకు అత్యవసరంగా B+ పాజిటివ్ రక్తం అవసరం ఉంటే నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యులు కడల బీరప్ప మరియు గొల్ల శివ కుమార్ గార్లు సకాలంలో ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. దాంతో అడివయ్య ఆరోగ్యం కుదుటపడింది. ఇంతటి గొప్ప మనసున్న వీరిద్దరికి నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ఫౌండర్ ముజ్జుభాయ్ మరియు తొలిపలుకు న్యూస్ తరుపున అభినందనలు తెలియజేయడం జరిగింది.