వాషింగ్టన్, అక్టోబరు 27: అమెరికా దివంగత అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన 3000 రహస్య ఫైళ్లను అమెరికా బహిర్గతం చేసింది. వీటిలో క్యూబా అప్పటి అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోను అంతమొందించడానికి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పన్నిన కుట్రల వివరాల ఫైళ్లు కూడా ఉన్నాయి. 1963 నవంబరు 22న టెక్సా్‌సలోని డాల స్‌లో కెన్నెడీ హత్య జరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇప్పటికే కెన్నెడీ కేసుకు సంబంధించి 3810 రికార్డులను సంపూర్ణంగా, 3369 రికార్డులను పాక్షికంగా నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసింది. ఇంకా చాలా పత్రాలు పెండింగ్‌లో ఉండడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 3000 రహస్య ఫైళ్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. మిలిటరీ రహస్యాలు, నిఘా ఆపరేషన్లు, విదేశీ సంబంధాలకు సంబంధించిన సున్నితమైన అంశాల దృష్ట్యా భద్రతాసంస్థల విజ్ఞప్తి మేరకు కొన్ని రహస్య ఫైళ్లను విడుదల చేయరాదని ట్రంప్ నిర్ణయించారు.
