బి.జె.పి. రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కచేయట్లేదని నిప్పులుచెరుగుతున్న కె.సి.ఆర్. జాతీయ స్థాయిలో తన ప్రతాపం చూపిస్తానంటూ విరుచుకు పడుతున్నాడు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. బి.జె.పి యేతర పార్టీల సి.ఎం. లతో మంతనాలు జరుపుతున్నాడు. బి.జె.పి కి కాంగ్రెస్ తోపాటు మరో ప్రతిపక్షాన్ని రూపొందించే ప్రక్రియలో నిమగ్నమయ్యాడు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో ముంబయికి వెళ్లి కలువనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనే స్వయంగా హైద్రాబాద్ వచ్చి కలువనున్నట్లు తెలిపారు. తను ఇంతకు ముందే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, ఎ.రాజాతో, మరియూ ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో సమావేశమయ్యారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ బి.జె.పి. యేతర కూటమి సమావేశం జరుగనుందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. జనగామ, భువనగిరి బహిరంగ సభలతో పాటు ఈ మధ్య జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ బి.జె.పి. టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.