ఎస్.ఇ.ఎస్ జియో లు కలిసి ‘జియొ స్పేస్ టెక్నాలజీస్ ‘ అనే కొత్త సంస్థను ప్రారంభించాయి. ఈ జాయింట్ వెంచర్ లో జియో కు 51%, ఎస్.ఇ.ఎస్ కు 49% వాటా ఉంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల వలన తమకు అదనపు సామర్థ్యం, కవరేజ్ లభిస్తాయని చెప్పారు. దీని వలన జియో పల్లెలకు, ఇతర పట్టణాలు, బిజినెస్‌లకు, కస్టమర్లకు కొత్త డిజిటల్ ఇండియా తో కనెక్ట్ చేసే అవకాశం ఏర్పడిందని తెలియజేశారు.
ఇందులో భాగంగా ‘జియొ స్పేస్ టెక్నాలజీస్’ అనేక కక్ష్యలలోని ఉపగ్రహాల నెట్వర్క్లను ఉపయోగించుకుంటుంది. దీనిద్వారా 100 జి.బి.పి.యెస్. వరకు అంతర్జాల సేవలను అందించవచ్చు.