IRNSS-Gagan

భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)

IRNSS – NAVIC: భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ

భూతల, జల, వాయు మార్గాల్లో కచ్చితత్వంతో కూడిన నావిగేషన్ సేవలను అందించడానికి ఉద్దేశించిన స్వదేశీ ప్రాజెక్టు భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం). దీనిలో భాగంగా ఇస్రో మొత్తం ఏడు ఉపగ్రహాలను వారి వాటి నిర్ణీత కక్ష్యల్లోకి పంపించింది. దీంతో నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)గా వ్యవహరించే భారత ప్రాంతీయ దిక్సూచి సేవలను ఉపగ్రహ వ్యవస్థ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవడానికి మార్గం సుగమమైంది. పలు పరిశీలనలు, పరీక్షల అనంతరం నావిక్ సేవలు వినియోగదారులు, మిలటరీ అవసరార్థం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో ఉపయోగించిన ఏడు ఉపగ్రహాలు:

  1. IRNSS -1A (భూ అనువర్తన కక్ష్య)
  2. IRNSS -1B (భూ అనువర్తన కక్ష్య)
  3. IRNSS -1C (భూస్థిర కక్ష్య)
  4. IRNSS -1D (భూ అనువర్తన కక్ష్య)
  5. IRNSS -1E (భూ అనువర్తన కక్ష్య)
  6. IRNSS -1F (భూస్థిర కక్ష్య)
  7. IRNSS -1G (భూస్థిర కక్ష్య)

IRNSS-India-Overview-Navigation-Satellites

  • వీటిలో చివరిదైన IRNSS – 1జి ఉపగ్రహాన్ని 2016, ఏప్రిల్ 28న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి భూస్థిర కక్ష్యలోకి ప్రయోగించారు. పీఎస్‌ఎల్వీ వాహకనౌకకు ఇది 35వ ప్రయోగం కాగా, 34వ విజయవంతమైన ప్రయోగం. మొదటి ప్రయోగం పీఎస్‌ఎల్వీ డీ1 మాత్రమే విఫలమైంది.
  • కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా జీపీఎస్(GPS) సేవలను అందించడానికి నిరాకరించడంతో మరోసారి ఆ పరిస్థితులు ఏర్పడకుండా మిలటరీ, పౌర ప్రయోజనార్థం, భూ, జల, వాయు మార్గాల్లో మార్గనిర్దేశనం కోసం సొంత టెక్నాలజీతో భారతదేశ ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం, ఇస్రో నిర్ణయించాయి.
  • ఈ ఏడు ఉపగ్రహాల్లో మొదటిదైన IRNSS -1A ను 2013, జూలై 1న ప్రయోగించారు. ప్రయోగించిన ఏడు ఉపగ్రహాల్లో 4 భూ అనువర్తన కక్ష్యలో, 3 ఉపగ్రహాలు (IRNSS – 1C, 1F, 1G) భూస్థిర కక్ష్యల్లో పరిభ్రమిస్తాయి.
  • భూ అనువర్తన కక్ష్యలో పరిభ్రమించే 4 ఉపగ్రహాలు 8 ఆకారంలో పరిభ్రమిస్తాయి. ఉపగ్రహాల్లో సమయాన్ని కచ్చితంగా గణించడానికి రుబీడియం పరమాణు గడియారాలను అమర్చారు.

ఉపగ్రహాల్లోని పేలోడ్లు(payload)

ప్రతి ఉపగ్రహంలోనూ రెండు రకాల పేలోడ్లు ఉంటాయి.

  1. దిక్సూచి పేలోడ్: ప్రామాణిక దిక్సూచి సేవలు అందించడానికిగాను ఎల్5 బ్యాండ్ (1176.5 మెగాహెర్ట్), ఎస్ బ్యాండ్ (2492.028 మెగాహెర్ట్)ల్లో పనిచేసే నావిగేషన్ సాధనాలను అమర్చారు.
  2. రేంజింగ్ పేలోడ్: దీనికిగాను సీ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్‌ను అమర్చారు. లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్‌రెట్రోరిఫ్లెక్టర్‌ను అమర్చారు. ఈ విధమైన పేలోడ్‌ల వల్ల దేశంలోపలే కాకుండా దేశ సరిహద్దుల నుంచి 1500 కి.మీ. విస్తీర్ణం మేర విస్తరించిన ప్రాంతంలో 10-20 మీ. కచ్చిత్వంలో స్టాండర్డ్ పొజిషనింగ్ సేవలు అందించవచ్చు.

వ్యయం:

  • పూర్తిస్థాయి నావిక్ వ్యవస్థ అందుబాటులోకి రావడానికి ఒక్కో ఉపగ్రహంపై రూ. 150 కోట్లు. ప్రయోగ వాహకనౌకకు రూ. 130 కోట్లు, భూతల విభాగంలో, ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నళ్లను స్వీకరించి విశ్లేషన చేసే పలు కేంద్రాల ఏర్పాటుతో ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 1400 కోట్లు పైనే ఉంటుంది.

నావిక్(NAVIC) సేవలు అందించేందుకు ఏర్పాటైన వ్యవస్థలు:

నావిక్ సేవల అందించేందుకు భూతల విభాగంలో కింది వ్యవస్థలు ఏర్పాటయ్యాయి.

  • 24/7 విధానంలో సేవలందించేందుకు దేశవ్యాప్తంగా 13 ఇండియన్ రేంజ్ అండ్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ స్టేషన్లు ఉన్నాయి. భవిష్యత్తులో మరో రెండు స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.
  • ఒక ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ నెట్‌వర్క్ టైమింగ్ సెంటర్ (IRNWT) ఏర్పాటైంది. భవిష్యత్తులో మరో కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • ఇస్రో నావిగేషన్ సెంటర్ (INC) ఒకటి ఏర్పాటైంది. భవిష్యత్తులో మరొకటి ఏర్పాటు కాగలదు.
  • సమాచార ప్రసార నెట్‌వర్క్‌తో కూడిన స్పేస్‌క్రాఫ్ట్ కంట్రోల్ ఫెసిలిటీ (SCF) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్ముందు మరో కేంద్రం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

నావిక్ (NAVIC) వల్ల కలిగే ప్రయోజనాలు:

  • నావిక్ వ్యవస్థ ద్వారా జీపీఎస్ తరహాలో రూపొందించిన ప్రత్యేక పరికరాలు, మొబైళ్ల సాయంతో మిలటరీ, సాధారణ పౌర అవసరార్థం నావిగేషన్ సమాచారాన్ని ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతికూల పరిస్థితుల్లోనైనా నిరంతరాయంగా కచ్చితత్వంతో అందించవచ్చు.
  • ఈ వ్యవస్థ మిలటరీ అవసరాల కోసం రిస్టిక్టెడ్ సర్వీసులను సాధారణ పౌరులకు స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్‌ల రూపంలో నావిగేషన్ సదుపాయాల్ని కల్పిస్తుంది.
  • విమానాలు, నౌకలు ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన రాడార్ల పరిధుల్లో దూరం, సమయం ఎక్కువైనా ప్రయాణించక తప్పని పరిస్థితి. నావిక్ వ్యవస్థ ద్వారా ఈ ఇబ్బంది తప్పి దూరం, సమయాలతో పాటు ఖర్చు కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
  • వాహనాల గమనాన్ని పర్యవేక్షించుటకు, నేవీకి సంబంధించిన ఫ్లీట్ నిర్వహణలో ఉపయుక్తం.
  • అత్యవసర పరిస్థితుల్లో, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అవసరమైన ప్రాంతాలకు, వ్యక్తులకు వివిధ వ్యవస్థలు త్వరగా చేరుకునేలా దారిచూపి బాధితులకు సత్వర సహాయం అందేలా చేస్తుంది.
  • మిస్సైల్ టెక్నాలజీలో, మిస్సూల్స్‌కు అవసరమైన నావిగేషన్‌ను అందించి వాటి కచ్చితత్వాన్ని పెంపొందించగలదు.
  • మొబైల్ ఫోన్లతో అనుసంధానమైన జీపీఎస్ తరహా సేవలను అందిస్తూ పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయవచ్చు. దేశ, విదేశీ పర్యాటకులకు గమన నిర్దేశ సౌకర్యాలను అందిస్తూ వారి సమయాన్ని ఆదా చేయడమేగాక మరిన్ని ప్రదేశాలను తక్కువ సమయంలో పర్యటించేలా చేయవచ్చు.
  • సహజ వనరులను వెలికితీసేందుకు ఉద్దేశించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సమాచారాన్ని నావిక్ వ్యవస్థతో విశ్లేషింపజేసి, ఆ వనరులున్న ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు సహాయపడగలదు.
  • మత్య్సకారులకు చేపలు అధికంగా ఉండే ప్రాంతాలను సూచిస్తూ ఆ ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకొనేలా సూచనలందిస్తుంది.
  • పర్వతారోహకులకు పర్వతారోహణలో, అడవుల వంటి వివిధ ప్రాంతాల్లో సాహస యాత్రలు నిర్వహించే బృందాలకు గమన నిర్దేశణలో సహాయకారిగా ఉంటుంది.
  • తన అవసరాలకేకాక పొరుగు దేశాలకు సైతం ఈ తరహా సేవలను అందించడానికి భారత్ ముందుకు వచ్చి తన ఔన్నత్యాన్ని చాటుకుంది.

భారత్లో నావిక్ వ్యవస్థకు ముందు నావిగేషన్ సేవలు

  • విమానయానంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ల నియంత్రణ సమన్వయానికి వీలుగా రీజినల్ నావిగేషన్ సిస్టం అభివృద్ధికి ఇస్రో, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా కృషి చేశాయి. దీనిలో భాగంగా ప్రధాన విమానాశ్రయాల్లో 2007లో టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ సిస్టంను ఏర్పాటు చేశారు.
  • ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టం లేదా శాట్‌నావ్ వ్యవస్థ ఏర్పాటుకు ఇస్రో, ఏఏఐ సంయుక్తంగా జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మింటెడ్ నావిగేషన్- గగన్ (GAGAN) అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • ఇందుకోసం తొలి గగన్(GAGAN) పేలోడ్‌ను జీ శాట్-8, జీ శాట్-10, జీ శాట్-15 ఉపగ్రహాలతో పాటుగా అమర్చి ప్రయోగించారు. ఈ ప్రయోగాలు 2011 మే 21, 2012 సెప్టెంబర్ 29, 2015 నవంబర్ 10న జరిగాయి.

ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో ఉన్నదిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలు (Navigation Satellite Systems)

GPS comparison

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions