సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఒక కొత్త వర్క్‌కల్చర్ ను ఏర్పాటు చేయబోతోంది. వారు ఆఫీస్‌కు వచ్చే పనిలేకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ కొత్త వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇలాంటి వర్క్‌కల్చర్ ను ఏర్పాటు చేసిన కంపెనీ ఇన్ఫోసిస్ మాత్రమే.
క్యూ4 ఫలితాలను ఇన్ఫోసిస్ విడుదల చేసింది. వీటిని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ విడుదలచేశారు. వీటి ఆధారంగా ఇన్ఫోసిస్‌లో 3,14,105 మంది అంటే దాదాపు 95% మంది ఇంటినుండే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వారు ఆఫీస్‌లో వర్క్‌చేయడానికి చేసేలా 3 విధాలుగా చేశారు.
ఫస్ట్ ఫేస్‌లో ఆఫీస్‌కు వచ్చే పనిలేకుండా వారి దగ్గర్లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్(డీసీ)లను ఏర్పాటు చేస్తుంది. ఈ సెంటర్లకు ఉద్యోగులు కనీసం వారానికి రెండు సార్లు రావాలి. ఇక సెకండ్ ఫేజ్‌లో గ్రామాల్లో డీసీ సెంటర్లను ఏర్పాటు చేయలేమని,అక్కడి ఉద్యోగులు కొన్ని రోజుల్లో తిరిగి ఆఫీస్‌లకు వచ్చేలా చూసుకోవాలని తెలిపారు. మూడో ఫేజ్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌గా ఉంటుంది. ఇది క్లయింట్ రిక్వెరైమెంట్‌ను బట్టి మారుతుంది.