హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ నగరంలోని జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…

60 లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాం. మొన్న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేసుకున్నాం. ఇప్పుడు మన ముందు ఏ ఎన్నిక లేదు. హుజూరాబాద్ ఎన్నిక సమస్యనే కాదు. ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దాని కోసం సైన్యం ఉంటే సరిపోదు. ఇందుకు ఎక్కడికక్కడ కమిటీలు పటిష్టంగా ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలి. గ్రేటర్ పరిధిలో 4,800 దాకా కాలనీ అసోసియేషన్‌లు ఉన్నాయి. 1486 నోటిఫైడ్ బస్తీలు ఉన్నాయి. మొత్తం కలిపి 6,300 దాకా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. డివిజన్లతో పాటు వీటికి కూడా కమిటీలు వేసుకోవాలి. సెప్టెంబర్ 29వ తేదీ లోపు బస్తీ, కాలనీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలో 15 మందికి తగ్గకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. డివిజన్ స్థాయిలో 150 డివిజన్ కమిటీలు వేసుకోవాలి. ఈసారి జిల్లా కమిటీలు వేసుకోవాలని కేసీఆర్ చెప్పారు అని కేటీఆర్ వెల్లడించారు.