ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 1.68 లక్షల కోట్లు రూపాయలు జీఎస్‌టీ పన్నులు వచ్చాయి.ఇందులో జీఎస్‌టీ సీజీఎస్‌టీ డబ్బులు 33,159 కోట్లరూపాయలు, ఎస్‌జీఎస్‌టీ కి 41,793 కోట్లు, ఐజీఎస్‌టీ కి 81,939 కోట్లరూపాయలు వచ్చాయి. ఇవి కాకుండా మరో 10,649 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి.
సరైన సమయంలో పన్నులు ఇచ్చేవారి విధానాన్ని సులభతరం చేసినందున మరియూ చెల్లించని వారిపై తీసుకున్న చర్యల వల్లనే ఈ పన్నులు పెరిగాయని ఆర్థికశాఖ ప్రకటించింది. ఈసారి పన్నులు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో పోలిస్తే ఈ వసూళ్ల అభివృద్ధి 20% జరిగింది.