శేరిలింగంపల్లి :కార్తీక పుణ్యమాస చివరి సోమవారం సందర్భంగా రాయదుర్గంలోని నాగార్జున ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సహస్రనామ పుష్పార్చన భక్తులచే మహా రుద్రాభిషేకం హనుమాన్ దేవాలయం నుండి స్వామివారి ఊరేగింపు చేశారు, అనంతరం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిపారు ,తదుపరి ఏక హారతి నక్షత్ర హారతి మహారథి కుంభ హారతులతో భక్తులు పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా శ్రీ త్రిదండి శ్రీనివాస రామానుజ చిన్న జీయర్ స్వామి, అహోబిలం పీఠాధిపతి, డాక్టర్ బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, పీఠాధిపతి కమలేష్ దాస్టి మహారాజ్, హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున కార్తిక దీపాలు వెలిగించి భక్తి శ్రద్దలను చాటుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు నాగార్జున ఉన్నత పాఠశాల చైర్మన్ ఏ,కృష్ణ పాఠశాల అధినేత ఏ భరత్ కుమార్, పీపుల్ ఎనాబ్లర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
