మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం
తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికి నిదర్శనం సదర్
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
శ్రీకృష్ణుని అంశతో జన్మించిన యాదవులు కులవృత్తిలో భాగంగా పాడి పరిశ్రమ అభివృద్ధిలో దున్నపోతులు
కీలక పాత్ర పోషిస్తుంటాయని అన్నారు. శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో అంగరంగ వైభవంగా బొద్ధం కుటుంబం ఆధ్వర్యంలో సదరు పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, బొద్ధం ఆగమయ్య , బొద్ధంరాజు,బొద్ధంరాజు,బొద్ధం యాదగిరి, బొద్ధం చరణ్, యశ్వంత్, అఖిల్, సాయి యాదవ్, రాజేష్ యాదవ్, బాలు, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సదర్ నేడు దేశంలోనే వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పండుగలా మారింది. యాదవులందరినీ ఐక్యం చేసి జరుపుకునే పండుగ. యాదవుల ఆచార వ్యవహారాలకు సాంప్రదాయ సాంస్కృతికి దున్నపోతుల పండుగ సదర్ ప్రసిద్ధి చెందినది.
భారతదేశంలోని మొత్తం జనాభాలో 20% యాదవులు, నేపాల్ జనాభాలో 20% యాదవులు ఉన్నారు. ఈ భూమిపై 3% జనాభా కలిగిన అనేక అనుబంధ కులాలు ఉన్న వర్గం యాదవులు. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, మధ్యప్రాచ్యంలో కూడా ఈ కులం జాడలు ఉన్నాయి. వేద సాహిత్యాల ప్రకారం, యదువంశీయులు యయాతి రాజు పెద్ద కుమారుడు యదు వంశస్థులు. యాదవ సమాజం భారత సాయుధ, రక్షణ దళాలకు ఎంతగానో సేవ చేసింది. భారతదేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను సైతం అర్పించింది.
రాజకీయాల్లో సైతం యాదవులు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కూడా యాదవులు పని చేశారు. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (రిపబ్లిక్), జనతాదళ్ (కమ్యూనల్), మక్కల్ తమిళ దేశం (తమిళనాడు) వంటి అనేక రాజకీయ పార్టీల ద్వారా యాదవులు దేశంలో రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్నారు.